నిజామాబాద్, కామారెడ్డిలో భారీగా కురుస్తున్న వర్షాలు | Heavy Showers Continuing | in Nizamabad

Share this & earn $10
Published at : September 09, 2021

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు నిండిపోయాయి. నిజామాబాద్ నగరం, ఆర్మూర్, బాల్కొండ, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో భారీ వర్షాలు పడుతున్నాయి. అత్యధికంగా ఆర్మూర్ లో 10సె. మీ., ఆలూరు లో 14.సె. మీ.ల చొప్పున వర్షం పడింది. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా జోరువాన పడుతోంది. కామారెడ్డి, మాచారెడ్డి, బిక్కనూర్, గాంధారి, బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, మద్నూర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి మండలం గర్గుల్ లో వర్షాలకు ఇంటి గోడ నాని కూలింది. ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరొకరికి కాలు విరిగింది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. పిట్లం మండలం రాంపూర్ కలాన్ వద్ద వంతెనపై వర్షపు నీరు చేరి బాన్సువాడ-పిట్లం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------- నిజామాబాద్, కామారెడ్డిలో భారీగా కురుస్తున్న వర్షాలు | Heavy Showers Continuing | in Nizamabad
ETVETVTeluguETV NewsVideo